ఎవరూ మాట్లాడకపోవడమే మంచిది
- ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచలేం
- సిరాజ్ అంశంపై కపిల్‌దేవ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబర్ 21: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో(New Zealand Test) మహ్మద్ సిరాజ్‌ను(Mohammed Siraj) ఆడించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మైదానం పరిధి దాటి రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అంశాలపై ఎవ రూ మాట్లాడొద్దని సూచించారు. తుది జట్టు ఎంపికపై బయటివారు మాట్లాడడం సరికాదని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డా రు. జట్టు ఎంపిక నిర్ణయం సెలక్టర్లు, కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ దేనని స్పష్టం చేశారు.
వ్యక్తిగతం గా సిరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే జట్టు ఎంపిక విషయంలో తన అభిప్రాయానికి ప్రాధాన్యత లేదని ఆయన పేర్కొన్నారు.జట్టు ఎంపి కపై తనలాంటి వారు వ్యాఖ్యానించడం సరికాదని, ఈ విషయంలో సెలక్టర్లనే ప్రశ్నించా లని కపిల్ దేవ్ అన్నారు.ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం అసాధ్యమన్న కపిల్‌దేవ్ జట్టు వ్యూహాలు, ప్రణాళికల ప్రకారమే ఎం పికలు ఉంటాయని చెప్పుకొచ్చారు.