ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా జయవర్థనే
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళా జయవర్థనే(Mahela Jayawardene)ను తమ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కో-ఓనర్ అయిన జీఎంఆర్ స్పోర్ట్స్ వ్యవహారాలను మహేళ జయవర్దనే పర్యవేక్షించనున్నాడు. ఐఎల్టీ20లోని దుబాయ్ క్యాపిటల్స్, ఎంఎల్సీ లీగ్‌లోని సీటెల్ ఓర్కాస్, ది హండ్రెడ్ లీగ్‌లోని సదరన్ బ్రేవ్ జట్లకు జయవర్దనే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే డబ్ల్యూపీఎల్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ ఐదుసార్లు ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ మహిళల జట్టుకు జయవర్థనే అనుభవం ఉప యోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇదిలా ఉంటే గత ఐపీఎల్ సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా ఉన్న జయవర్థనేను ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పించారు.