నెం.1 బౌలర్‌గా స్టార్క్

05-11-2026 | 05:10am
  1. యెన్సన్‌ను వెనక్కి నెట్టిన ఆసీస్ పేసర్
  2. ఐదో స్థానంలో బుమ్రా

దుబాయి, నవంబర్ 4 : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిఛెల్ స్టార్క్(Australia's star pacer Mitchell Starc) ఐసీసీ టెస్ట్ ర్యాం కింగ్స్‌లో మళ్లీ నెంబర్ వన్ అయ్యాడు. ఇటీవల సౌతాఫ్రికాపై(South Africa) టెస్ట్ సిరీస్‌లో రాణిం చడంతో మార్కో యెన్సన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో(Test match) స్టార్క్ 9 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనతోనే టాప్ ప్లేస్‌కు(Top place) దూసుకొచ్చాడు ఈ ఏడాది ఆగస్టులో బుమ్రాను అధిగమించి స్టార్క్ తొలి సారి నంబర్ 1 స్థానానికి చేరుకోగా, ఇటీవల జాన్సెన్ కొద్దిరోజుల పాటు ఆ స్థానంలో నిలిచాడు.

ఇప్పుడు కేప్ టౌన్ టెస్ట్ తర్వాత స్టార్క్ తిరిగి తన నంబర్ వన్ కిరీటాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా సత్తా చాటాడు. ఆస్ట్రేలియా తో మూడో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అతడు ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. భారత్ తరఫున బుమ్రా ఐదో స్థానా న్ని నిలబెట్టుకోగా.. మ్యాట్ హెన్రీ, ఓలీ రాబిన్సన్, స్కాట్ బోలాండ్, రబాడ, కమిన్స్, హాజిల్వుడ్ టాప్- 10లో కొనసాగుతున్నారు.

టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్రూక్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రూట్, హెడ్, బవుమా, స్టీవ్ స్మిత్, రచిన్ రవీంద్ర, పంత్, డారిల్ మిచెల్, గిల్, కమిం దు మెండిస్ టాప్-10లో ఉన్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్‌ల్లో యాన్సెన్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. రవీంద్ర జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన హార్మర్ ఆల్‌రౌండర్ విభాగంలోనూ చెలరేగి టాప్-5లోకి వచ్చాడు. అటు టీ20 బ్యాటింగ్ ర్యాం కింగ్స్‌లో భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రెండు స్థానాలు మెరుగై ఏడో ర్యాంకులో నిలిచాడు. అభిషేక్ శర్మ అగ్రస్థానంలోనూ, ఇషాన్ కిషన్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు