నిప్పులు చెరిగిన షమీ

05-11-2026 | 05:10am

కోల్‌కతా, నవంబర్ 4: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Team India veteran pacer Mohammed Shami) రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు.  గాయం తర్వాత అ ద్భుతంగా రాణిస్తున్న ఈ సీనియర్ పేసర్ వరుస వికెట్లతో సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న షమీ తాజా గా మరోసారి సూపర్‌స్పెల్‌తో అదరగొట్టాడు. మహారాష్ట్రతో(Maharashtra) జరుగుతున్న మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసాడు.దీనికి ముందు ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ 4/30 వికెట్లు తీసి సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు.

రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ, విజయ్ హజారే వంటి దేశవాళీ టోర్నీలలో స్థిరంగా వికెట్లు తీస్తూ తన పాత లయను, ఫిట్‌నెస్ నిరూపించుకుంటున్నాడు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటనకు ఎం పిక కాకపోయినప్పటికీ, తానూ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, భారత్ తరఫున మళ్లీ ఆడాలనే పట్టు దలతో ఉన్నానని షమీ స్పష్టం చేశాడు. భువనేశ్వర్‌కు టీ20ల్లో అవకాశమిచ్చిన సెలక్టర్లు షమీని టెస్టుల్లోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు