స్నేహిత్ సంచలనం
జాతీయ ర్యాంకింగ్ టీటీ ఛాంపియన్‌షిప్ కైవసం
ఫగ్వారా, నవంబర్ 17 : తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్నేహిత్(Telangana table tennis player Snehit) సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక జాతీయ ర్యాం కింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో(National Ranking Table Tennis Championship) విజేతగా నిలిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ , నాలుగో సీడ్ అంకుర్ భట్టాఛార్జిపై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో స్నేహిత్ 4-3 తేడాతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. స్నేహిత్ కెరీర్‌లో ఇదే తొలి జాతీయ టైటిల్. అలాగే మహిళల సింగిల్స్‌లో దివ్యాన్షి భౌమిక్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఆమె 4 స్కోరుతో అనన్యపై విజయం సాధించింది.