ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా గంగూలీ
07-10-2026 | 05:20am
న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : ఐపీఎల్ మినీవేలం ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ(Delhi Capitals franchise) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని(Sourav Ganguly) తమ కొత్త హెడ్ కోచ్‌గా(Head Coach) నియమించింది. గత రెండు సీజన్లుగా కోచ్‌గా వ్యవహరించిన హేమంగ్ బదోనీ స్థానంలో గంగూలీ బాధ్యతలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా వేదికగా డిల్లీ, ఇట్స్ టైమ్ ఫర్ దాదాగిరి‘ అంటూ ప్రకటించింది. దాదా ఐపీఎల్‌లో ఒక జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.