సన్‌రైజర్స్‌లోకి నటరాజన్
- ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ డీల్
- జీషన్ అన్సారీ వదులుకున్న హైదరాబాద్
ముంబై, అక్టోబర్ 14: ఐపీఎల్ 2027 సీజన్(IPL 2027 season) మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్లేయర్ స్వాప్ ట్రేడ్ డీల్ చేసుకుం ది. ఆరెంజ్ ఆర్మీ మాజీ పేసర్, యార్కర్ల కింగ్ టీ నటరాజన్(T. Natarajan) జట్టులోకి తిరిగొచ్చాడు. అతనికి బదులుగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని వదులుకుంది.
ఈ ప్లేయర్ స్వాప్ డీల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ధ్రువీకరించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ(Sunrisers Hyderabad franchise) కూడా జట్టులోకి నటరాజన్ తిరిగొచ్చాడనే విషయాన్ని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంది. నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అసా ధారణ ప్రదర్శన కనబర్చాడు. టీమిండియా లో చోటు దక్కించుకొని తర్వాత గాయాల బెడదతో జట్టుకు దూరమై ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్ 2025 వేలంలో నటరాజన్ రూ.10.75 కోట్లు దక్కించుకోగా, జీషన్ అన్సారీ రూ.40 లక్షలతోనే ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి చేరాడు.