ఖేలో ఇండియా గేమ్స్ ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(Telangana Chief Secretary Sanjeev Jaju) క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. శాట్స్ ఎండీ సోనీ బాలాతో కలిసి గచ్చిబౌలి స్టేడియం, యూసుఫ్‌గూడ స్టేడియంలను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకం గా నిర్వహించాలని సీఎస్ సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీ డా కారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని, స్టేడియంలలో అవసరమైన మౌలిక వసతులు, క్రీడా పరికరాలు, భద్రత, పారిశు ద్ధ్యం, తాగునీరు, రవాణా తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.