హోరాహోరీగా తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్
హైదరాబాద్, నవంబర్ 7 : గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో(Pullela Gopichand Badminton Academy, Gachibowli) జరుగుతున్న తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్(Telangana India International Challenge)- పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. నవంబరు 3న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ టోర్నీకి ఆదివారం తెరపడనుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత క్రీడాకారిణులు రక్షిత శ్రీ సంతోష్ రామ్రాజ్, రుజుల రాము తలపడనున్నారు. మిక్సిడ్స్ డబుల్స్‌లో రోడియన్ అలిమోవ్-అలీనా దవ్లెటోవా జోడీతో భారత జంట సతీ ష్ కుమార్ కరుణాకరన్- అశ్విని పొన్నప్ప అమీతుమీ తేల్చుకోనుంది.
మహిళల డబు ల్స్ టైటిల్ కోసం ఫత్తరిన్-జాన్పెంగ్(థాయ్లాండర్) జంట, మే సుడో-మై-తానాబే (జ పాన్) జోడీతో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తుషార్ సువీర్, భారత్ రాఘవ్, పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసా ద్ -కృష్ణమూర్తి జోడీ, సాయి ప్రతీక్-సబపతి జంట తో టైటిల్ కోసం తలపడనుంది.