టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ ఈగల్స్ ఎంట్రీ
ఫ్రాంచైజీ కొన్న తెలుగు వ్యాపారవేత్త అన్నం సతీష్ ప్రభాకర్
శ్రీకర్ భరత్,బౌల్ట్,హెట్మెయిర్ వంటి స్టార్ ప్లేయర్స్
హైదరాబాద్, అక్టోబర్: క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్(Cricket's fastest format) టీ10 లీగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అబుదాబీ టీ10 లీగ్ పేరుతో 2017లో మొదలైన ఈ లీగ్‌లో ఇప్పుడు కొత్తగా ఎమిరేట్స్ ఈగల్స్ టీం(Eagles Team) ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫ్రాంచైజీని తెలుగు వ్యాపారవేత్త అన్నం సతీష్ ప్రభాకర్ సొంతం చేసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association) మద్ధతుతో ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో అమరావతి రాయల్స్ ఫ్రాంచైజీతో క్రికెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు టీ10 లీగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రాంచైజీని దక్కించుకున్నారు.
యూఏఈ వేదికగా జరిగే అబుదాబీ టీ10 లీగ్‌లో అడుగుపెట్టడం వెనుక వ్యాపారకోణం కంటే కూడా క్రికెట్‌పై తనకున్న అభిరుచే కారణమని సతీష్ ప్రభాకర్ చెబుతున్నారు. ఇటీవల జరిగిన వేలంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లను తమ జట్టులోకి తీసుకున్నారు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్, అంతర్జాతీయ స్టార్లు ట్రెంట్ బౌల్ట్, హెట్మెయిర్, పావెల్, నూర్ అహ్మద్, హేల్స్,డేవిడ్ వీజ్, క్రిస్ గ్రీన్, కుశాల్ పెరీరా వంటి ఐపీఎల్ స్టార్ క్రికెటర్లను వేలంలో సొంతం చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయంగా తెలుగురాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం తన లక్ష్యాలుగా సతీష్ ప్రభాకర్ చెప్పారు. టీ10 లీగ్ ఫార్మాట్‌కు మరింత ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తాను ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఏడాది అబుదాబీ టీ10 లీగ్ సీజన్ నవంబర్ 7 నుంచి 20 వరకూ జరుగుతుంది.