ఉత్కంఠభరితంగా టీసీఏ అండర్‌హే లీగ్

18-10-2026 | 05:15am

వరంగల్, అక్టోబర్ 17 : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న అండర్-- రాష్ట్ర లీగ్  2026 పోటీలు ఉ త్కంఠభరితంగా సాగుతున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లలో జంగావ్, వికారాబాద్, అచ్చంపేట, జనగాం జట్లు విజయాలు సాధించా యి. మొదటి మ్యాచ్‌లో జనగాం జట్టు 1 పరుగు తేడాతో రంగారెడ్డిపై విజయం సా ధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జనగా్ంట 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగు లు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జనగాం బౌలర్లలో ఈ. సా గర్, ఎం.డి. గౌస్ చెరో 2 వికెట్లు పడగొట్టా రు. మరో మ్యాచ్‌లో వికారాబాద్ జట్టు 7 వికెట్లతో మహబూబ్‌నగర్‌పై ఘనవిజ యం సాధించింది. మహబూబ్‌నగర్ 16.3 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. వికారాబా ద్ బౌలర్లలో ఎ. అరుణ్ కుమార్ 3 వికెట్లు, బి. శివకుమార్ 2 వికెట్లు, సందీప్ రాథోడ్ 2 వికెట్లు సాధించారు.

92 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వికారాబాద్ జట్టు కేవలం 9.1 ఓవర్లలో దానిని అందుకుంది. అలాగే నారాయణపేట జట్టుపై అచ్చంపేట 9 వికెట్ల తేడాతో గెలిచింది. నారాయణపేట జట్టు 25 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. అనంతరం 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.మరో మ్యాచ్ లో ఖమ్మం జట్టుపై జనగాం విజయం సా ధించింది. 

జనగాం జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఖమ్మం బౌలర్లలో బనోత్ సృజన్ 5 వికెట్లు, సాయి గణేష్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఖమ్మం జట్టు 14.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జనగాం జట్టు 31 పరుగుల తేడా తో విజయం సాధించింది.


మరిన్ని వార్తలు