ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : భారత సిక్సర్ల కింగ్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. తొలిసారి పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా(Delhi Capitals batting coach) యువీ నియమితుడయ్యాడు. ఈ మేరకు డీసీ ఫ్రాంచైజీ సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటన చేసింది. హెడ్ కోచ్ గంగూలీ నేతృత్వంలో అసిస్టెంట్ కోచ్‌గానూ సేవలు అందిస్తాడని పేర్కొంది. 2007 టీ20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో యువీకి కీలకపాత్ర. క్యాన్సర్‌ను జయించి రీఎంట్రీ ఇచ్చిన యువీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఐపీఎల్ 2015 సీజన్లో యువీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం గిల్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్‌కు మెంటార్‌గానూ వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని యువీ పేర్కొన్నాడు. ఇది తనకు దక్కిన మంచి అవకాశమని చెప్పాడు. కాగా యువీకి స్వాగతం పలుకుతూ హెడ్ కోచ్ గంగూలీ మాట్లాడిన వీడియోను డీసీ షేర్ చేసింది. యువరాజ్‌ను దాదా టైగర్‌గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించాడు.