దోరకుంట గ్రామంలో పశువులకు ఉచిత వైద్య పరీక్షలు
11-11-2026 | 10:22pm
కోదాడ నవంబర్ 11 (విజయక్రాంతి): దోరకుంట గ్రామం(Dorakunta Village)లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. పశువులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువైద్య సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పాలకి సురేష్, వార్డ్ మెంబర్ గోవింద వెంకటయ్య, కోదాడ ఏరియా పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, కోదాడ మండల పశువైద్య అధికారి డాక్టర్ మధు గ్రామ ప్రజలు, గోపాలమిత్ర సూపర్వైజర్ సైదులు గోపాల మిత్రాలు ఎం ఆదినారాయణ కే శ్రీను ప్రసాద్ ఎస్ కే నజీర్ పాల్గొన్నారు.