ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల సాకారం

29-11-2026 | 07:03pm

నూతన గృహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరన్న నాయక్

చివ్వెంల, నవంబర్ 29 (విజయక్రాంతి): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్(Congress) ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను(Indiramma house) మంజూరు చేస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్(Mandal Congress President Dharavath Veeranna Naik) అన్నారు. ఆదివారం చివ్వెంల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు(Beneficiaries) వడ్డేపల్లి మేరీ–రాజు దంపతుల నూతన గృహాన్ని కాంగ్రెస్ నాయకుడు(Congress leader) వెన్న మధుకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీరన్న నాయక్ మాట్లాడుతూ.. దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో మొదటి విడతలో చివ్వెంల గ్రామానికి 44 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 70 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు