ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపనలు
కౌన్సిలర్లు మాళోతు చైతన్య, ఉదయశ్రీ హరిప్రసాద్
కోదాడ నవంబర్ 17(విజయ క్రాంతి): పట్టణంలోని 7, 8 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ళకు(Indiramma's house) కౌన్సిలర్లు మాళోతు చైతన్య, ఉదయశ్రీ హరిప్రసాద్ మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాళోతు చైతన్య, ఉదయశ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma's house) మంజూరయ్యాయని, ఇళ్ళకు శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాలోత్ సైదా నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్మావత్ సీతారామ్ సింగ్, హరిప్రసాద్, భూక్యా రవి నాయక్, నరేందర్ నాయక్, ఖలీల్ పాల్గొన్నారు.