గంజాయి సేవించిన ముగ్గురికి పాజిటివ్‌

17-11-2026 | 08:19pm

డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు

ఇల్లెందు, (విజయక్రాంతి): గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ యు. వెంకన్నబాబు పర్యవేక్షణలో ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, అనంతరం భద్రాచలంలోని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.

ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యసనాలకు బానిసైన వారు డీ-అడిక్షన్ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఉమ, పి.ఎస్. పాణి, పోలీసు సిబ్బంది లాల్‌సింగ్, రవి, బాలు, ప్రవీణ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు