మెడికల్ మాఫియా.. ఆపేదెవరయా..?

17-11-2026 | 05:05am
  1. కోదాడలో మెడికల్ షాప్‌ల ఇష్టారాజ్యం
  2. కాలం చెల్లిన మందుల విక్రయాలు?
  3. శాంపిల్స్ కూడా అధిక ధరలకు అమ్మకాలతో ఆరోపణలు!
  4. అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు
  5. ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజల వేడుకోలు

కోదాడ, నవంబర్ 16 : పట్టణంలో కొన్ని మెడికల్ షాపుల(Medical Shops) నిర్వహణ, మందుల విక్రయాల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. కాలం చెల్లిన మందులు, అనుమతులు లేని ఔషధాల విక్రయాలు(Sales of medicines), ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మందులు అమ్ముతున్నారనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆందో ళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రుల పేరుతో పరీక్షల భారం మోస్తున్న రోగులకు, మందు ల కొనుగోళ్ల రూపంలోనూ అదనపు ఆర్థిక భారం పడుతోందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మెడికల్ మాఫియా.. ఆగడాలకు అడ్డూ.. అదుపూ.. లేకుండా పోయిందనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

 ఆదాయమే అంతిమ లక్ష్యం! 

ఆసుపత్రులు, మెడికల్ షాప్ లను ఏర్పాటు చేసిన కొందరు విలువలు, మానవత్వమును మంట గలిపి ఆదాయమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఒకే ఆసుపత్రి పరిధిలో ఐదారు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారనీ కొన్ని చోట్ల శాంపిల్స్ కోసం ఇచ్చిన మందులను సైతం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాలను అధి కారిక తనిఖీల ద్వారా నిర్ధారించాల్సిన అవసరం ఉంది.

మందుల నాణ్యత, గడువు తే దీలు, విక్రయ అనుమతులు, బిల్లుల జారీ, ఎంఆర్పీ అమలు వంటి అంశాలను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చే యాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటు ప్రజలకు సురక్షితమైన ఔషధాలు అందేలా చర్యలు చేపట్టాలి అప్పుడే వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు.

 అధికారుల తీరుపై అనుమానాలు 

 కొన్ని మెడికల్ షాపులలో అక్రమ విధానాల్లో మందులు అమ్ముతున్నా.. కొన్ని ప్రి స్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఇవ్వాల్సిన మందులనైనా అలవోకగా అమ్ముతున్నా.. సంబంధి త అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరుపై స్థానికంగా అను మానాలను వ్యక్తం చేస్తున్నారు. 

 పర్యవేక్షణ కరువు 

 కొన్ని మెడికల్ షాపుల యాజమాన్యాలు మాయే పెద్ద షాపులంటూ, మా వద్ద దొరకని మందులు అంటూ ఉండవని ప్రచా రం చేసుకుంటున్న షాపులపై పర్యవేక్షణ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల డాక్టర్ రాసే డ్రగ్ ఒకటి అయితే, వీరిచ్చేది మరొకటి అని, ఇదేంటని అడిగితే దానికి రిలేటెడ్ గా ఈ మందు పనిచేస్తదని వారికి కట్టబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే నిర్లక్ష్యానికి గురైతే సామాన్యుడికి రక్షణ ఎక్కడిదని పలువురు ప్రశ్ని స్తు న్నారు. ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యంగా భావించి ఇప్పటికైనా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తక్షణమే స్పందించి అన్ని మెడికల్ షాప్ లను పూర్తిస్థాయిలో పరిశీలించి అక్రమ విధానాలు అనుసరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన మందులు అందేలా చాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం 

మెడికల్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అధిక ధరలు అమ్మినా, గడువు తేదీ ముగిసిన మందులు అమ్మినా వెంటనే షాపు సీజ్ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. 

జీ.సురేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట

మరిన్ని వార్తలు