విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
* అబ్బిరెడ్డిగూడెం లో విషాద ఘటన
* బాత్రూంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి బలి
గరిడేపల్లి, నవంబర్ 29,(విజయక్రాంతి): మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి(Abbireddigudem village) చెందిన పిట్ట వెంకన్న (47) అనే వ్యక్తి ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి(accidental electric shock) గురై చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకన్న ఇంటిలోని బాత్రూం కి వెళ్ళిన సందర్భంగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(accidental electric shock) కు గురై అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. వెంకన్న కుమారుడు మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.