నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

11-11-2026 | 08:09pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్11: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దొనకొండ వెంకటేశ్వర్లు,సైదమ్మల కుమారుడు పవన్ - ఝాన్సీల వివాహ మహోత్సవం మండల కేంద్రం అర్వపల్లిలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(Tungaturthi MLA Mandula Sameelu ) ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి వెంకట్ రెడ్డి,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,పాలెల్లి సురేష్,ఈదునూరి సంతోష్,కందుల తిరుమలరావు,కందుకూరి మహేష్,బింగి బాలరాజు,మద్ది లింగరాజు,ఎల్లెంల ఉమేష్,విజయక్రాంతి రిపోర్టర్ వూర సంపత్ కుమార్,వూర కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు