ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆర్థిక సహాయం

11-11-2026 | 10:04pm

ఎన్ఆర్ఐ పానుగంటి రుషి రాజా దాతృత్వం

కోదాడ నవంబర్ 11(విజయ క్రాంతి): పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అనే సిద్ధాంతం నమ్మి, పేదరికంతో మగ్గి పరీక్ష ఫీజు(Examination fee) చెల్లించలేని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం మహత్తర సేవ అవుతుందని,ఆస్తులు సంపాదించడం, సంపద కూడబెట్టడం ప్రధానం కాదని చేతనైన మేరకు మానవ సేవ చేయడం మాధవసేవ అవుతుందని సూర్యాపేట జిల్లా డి.ఐ.ఈ.ఓ బి. సులోచన రాణి(B. Sulochana Rani, D.I.E.O., Suryapet District) అన్నారు.

బుధవారం కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో పరీక్ష ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థులకు ప్రవాస భారతీయుడు పానుగంటి రుషి రాజా 50 మంది విద్యార్థులకు 47,000 రూపాయల ఫీజులను చెల్లించారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి, తెలుగు ఉపన్యాసకులు వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు ఆర్. పిచ్చిరెడ్డి,జి. యాదగిరి,వి. బలభీమరావు,ఆర్.రమేష్,పి.రాజేష్, బి.రమేష్ బాబు, జి.వెంకన్న, ఆర్.రవి కిరణ్, కె.సతీష్, జి. నాగరాజు, ఎస్.గోపికృష్ణ, ఎస్. కె.ముస్తఫా,జె. తిరుపతయ్య, ఎస్.కె.ఆరిఫ్, జె.తిరుపతయ్య, కె.శాంతయ్య, ఎన్. జ్యోతిలక్ష్మి,ఆర్. చంద్రశేఖర్, టి.మమత, డి.ఎస్.రావు, విద్యార్థులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు