కార్తీక వనభోజనాల సందడి..

29-11-2026 | 07:53pm

ప్రకృతి ఒడిలో ఆత్మీయతల విందు! 

సంప్రదాయాల పరిమళంలో స్నేహానుబంధాల వేడుక

(విజయక్రాంతి): కార్తీక మాసం ఆధ్యాత్మిక శోభతోపాటు వనభోజనాల సందడిని సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా(Undivided Warangal District) వ్యాప్తంగా ఆదివారం పచ్చని చెట్ల నీడలు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఒక్కచోట చేరి విందు వినోదాలతో ఉల్లాసంగా గడిపారు. నిత్య జీవితంలోని ఉరుకుల పరుగులకు కాసింత విరామమిస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.

సంప్రదాయ వంటకాలతో సహపంక్తి భోజనాలు చేస్తూ ఆత్మీయతను చాటుకుంటున్నారు. ఉసిరి వృక్షం(Indian gooseberry tree) వద్ద పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కార్తీక మాస విశిష్టతను చాటుతున్నారు. తరాలు మారినా తరగని సంప్రదాయంగా కొనసాగుతున్న వనభోజనాలు కుటుంబ బంధాలకు వారధిగా, స్నేహ సౌరభాలకు వేదికగా నిలుస్తూ పల్లె,పట్టణాల్లో పండుగ సందడిని నింపుతున్నాయి.

మరిన్ని వార్తలు