నషా ముక్త్ భారత్ ర్యాలీ

29-11-2026 | 08:09pm

వరంగల్, నవంబర్ 29 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు నషా ముక్త్ భారత్ అభియాన్(Nasha Mukt Bharat Abhiyan) కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని ఓ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాశిబుగ్గ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్, గంప అశోక్, శంకర్రావు, సంపత్, రాజ్ కుమార్, డి ఎస్ మూర్తి, అశోక్, ఓలం ఉపేందర్, ఛాయా రాణి, రాధ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు