స్కానింగ్​ సెంటర్ల తనిఖీలు

11-11-2026 | 08:20pm

వరంగల్​ (విజయక్రాంతి): గ్రేటర్​ వరంగల్ పరిధిలో పీసీపీఎన్‌డీటీ(PCPNdt Act) చట్టం అమలు తీరుపై ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను బుధవారం వరంగల్​ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు.

వరంగల్​ ఆర్డీఓ సుమ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్​ రాజిరెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పీసీపీఎన్‌డీటీ (పిసిపిఎన్​డిటి) చట్టం అమలులో భాగంగా వరంగల్ జిల్లాలోని ఏడు ప్రైవేట్ ఆసుపత్రులలోని స్కానింగ్ కేంద్రాలను జిల్లా తగిన అధికారుల కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలోని రికార్డులు, రిజిస్టర్లు, యంత్రాల నిర్వహణ, చట్టపరమైన నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు స్పష్టంగా సూచించారు. పుట్టబోయే బిడ్డ ఆడ,మగ అనే విషయాన్ని తల్లిదండ్రులకు లేదా ఇతరులకు వెల్లడించకూడదని వైద్యులు పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఎన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు