కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

19-11-2026 | 06:10pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు(Mahabubabad MLA Camp) కార్యాలయంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ, మండల పరిధికి చెందిన 92 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాల(Shaadi Mubarak schemes) చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని, ఈ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు