తెగిపోయిన చేయి తిరిగి అమరిక
కేర్ హాస్పిటల్‌లో 10 గంటల శస్త్రచికిత్స
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): డ్రిల్ మెషిన్ ప్రమాదంలో(Drill machine accident) పూర్తిగా తెగిపోయిన 19 ఏళ్ల యు వకుడి కుడి ముంజేయిని కేర్ హాస్పిటల్స్(CARE Hospitals), హైటెక్ సిటీ వైద్యులు(Hitech City Doctors) విజయ వంతంగా తిరిగి అమర్చారు. సు మా రు 10 గంటలపాటు నిర్వహించిన క్లిష్ట శచికిత్సతో(Surgery) చేతిని కాపాడారు. ప్రమాదం జరిగిన గంటలోపే ఆస్పత్రికి చేరుకోవడం చికిత్స విజయవం తం కావడంలో కీలకమైంది. సీనియర్ కన్సల్టెంట్ --ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ దివ్య సాయి నర్సింగం ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, జనరల్ సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో చికిత్స చేశారు.
ఎముకలను ప్లేట్లతో స్థిరీకరించి, రక్తప్రసరణను పునరుద్ధరించి, దెబ్బతిన్న మృదు కణజాలా న్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం పున: అమర్చిన చేతికి రక్తప్రసరణ సాధారణంగా ఉండటంతో పా టు వేళ్లలో కదలిక, స్పర్శ కనిపిస్తున్నాయని డాక్ట ర్ దివ్య సాయి నర్సింగం తెలిపారు. ఇకపై పునరావాస చికిత్స ద్వారా చేతి పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెడతామని చెప్పారు. సీనియర్ కన్సల్టెంట్ --జనరల్ సర్జరీ డాక్టర్ కె.హరికృష్ణరెడ్డి, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్స ల్టెంట్--ఆర్థోపెడిక్స్ డాక్టర్ గొట్టెము క్క ల అశోక్ రాజు, కేర్ హాస్పిటల్స్, హైటె క్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్ట ర్ ప్రమోద్ చికిత్సలో పాల్గొన్నారు.