పైల్స్‌కు మందులతోనే చికిత్స

21-11-2026 | 05:00am

కరీంనగర్ మెడికవర్‌లో అత్యాధునిక లేజర్ చికిత్స

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): పైల్స్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం లేకుండానే నియంత్రించవచ్చని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి(Medicover Hospital) వైద్యులు తెలిపారు. వరల్డ్ పైల్స్ డే సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ఉచిత కన్సల్టేషన్ అందించనున్నట్లు ప్రకటించారు. మలద్వారం వద్ద రక్తస్రావం, నొప్పి, మంట, దురద, వాపు, గడ్డలు ఏర్పడటం పైల్స్ లక్షణాలని తెలిపారు.

మలబద్ధకం, ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గడం ప్రధాన కారణాలని వివరించారు. టాయిలెట్‌లో సెల్ఫోన్ వాడకాన్ని నివారించాలని, ఎక్కువసేపు కూర్చోకూడదని సూచించారు. రోగి పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స అందిస్తామని, ప్రారంభ దశలో మందులు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో సమస్యను నియంత్రించవచ్చని తెలిపారు.  ఈ  సదస్సు మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, మెడికల్ హెడ్ డాక్టర్ ప్రియాంక, ఆర్‌ఎంఓ డాక్టర్ నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు