గర్భాశయ ఫైబ్రాయిడ్స్కు చికిత్స
గర్భాశయాన్ని తొలగించకుండానే మెడికవర్ ఆస్పత్రిలో ఆపరేషన్
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): మహిళల్లో సాధారణంగా కనిపించే గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సమస్యకు అధునాతన మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్స విధానాలతో చికిత్స అందిస్తున్నట్లు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్(Medicover Women and Child Hospitals) వెల్లడించింది. ఫైబ్రాయిడ్స్ కారణంగా అధిక నెలసరి రక్తస్రావం, తీవ్రమైన నొప్పులు, కటి ప్రాంతంలో అసౌకర్యం, మూత్ర సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, భవిష్యత్తులో గర్భం దాల్చాలనే ఆలోచనలను బట్టి చికిత్స అందించాలన్నారు.
లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా ఫైబ్రాయిడ్సును తొలగిస్తూ గర్భాశయాన్ని కాపాడవచ్చని వివరించారు. సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ.. పెద్ద ఫైబ్రాయిడ్స్ శస్త్రచికిత్సల్లో రక్తస్రావం నియంత్రణ, అధునాతన మానిటరింగ్, రోగి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. భవిష్యత్తులో పిల్లలను కనాలని కోరుకునే మహిళలకు గర్భాశయాన్ని తొలగించకుండా ఫైబ్రాయి డ్స్ తొలగించే మయోమెక్టమీ విధా నం ఉపయోగకరమని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్ట ర్ స్వాతి, డాక్టర్ కవిత తదితరులున్నారు.