మెడికవర్ హాస్పిటల్ మరో ముందడుగు

21-11-2026 | 05:00am

డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): అధునాతన వైద్య సేవల్లో భాగంగా సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌(Medicover Hospitals)లో అత్యాధునిక డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన ప్రముఖ రోబోటిక్ సర్జ న్ డాక్టర్ చాడ్ కూపర్, అహ్మదాబాద్‌కు చెం దిన రోబోటిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ హెర్నియా సర్జన్ డాక్టర్ విశాల్ సోనీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ అడ్డాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, తన శస్త్రచికిత్స బృందంతో కలిసి సందర్శక వైద్యుల సమక్షంలో క్లిష్టమైన రోబోటిక్ అసిస్టెడ్ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.

రోబోటిక్ శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికత, ఖచ్చితత్వం, వైద్య నిపుణుల సమన్వ యంపై అవగాహన కల్పించారు. డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా త్రీడీ విజువలైజేషన్, అధిక ఖచ్చితత్వంతో కూడిన పరికరాల కదలికలు, మెరుగైన నియంత్రణతో సంక్లిష్ట శస్త్రచికిత్సలను తక్కువ కోతల తో నిర్వహించే అవకాశం ఉంటుందని హాస్పి టల్ వై ద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగాధర్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ కుమార్ మిశ్రా, డాక్టర్ రఘువీర్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, సెంటర్ హెడ్ కృష్ణవేణి, ఆసుపత్రి సీనియర్ వైద్యులు, కన్సల్టెంట్లు, యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు