స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండే ఆదర్శం

15-11-2026 | 04:33pm

బోథ్ నవంబర్ 15 (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధులు బీర్సాముండే(Freedom fighter Birsa Munda) నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఆదివాసీ నాయకులు మారుతి(Tribal leader Maruti) పేర్కొన్నారు. ఆదివారం సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో(Freedom Struggle) ఆదివాసీలను ఐక్యం చేసి నైజాం ప్రభుత్వాన్నే కాకుండా బ్రిటిష్ పాలకులను(British rulers) గడగడలాడించిన యోధుడు అన్నారు. ఆయన జీవితం నేటి తరాలకు ఆదర్శం అన్నారు.

ఆదివాసీల ఐక్యతలకు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఆయన చేసిన కృషి మరువలేమన్నారు. కార్యక్రమంలో సార్ మేడి లక్ష్మణ్ ఆత్రం గంగాధర్ ,తులసిరాం  జంగు ,జైతు పటేల్, వజ్జర్ సర్పంచ్ లక్ష్మణ్ ,బిజెపి నాయకులు దిగోలే విష్ణు, బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కొండమడుగు గణేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు