ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి

17-11-2026 | 04:55pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(MP Vem Narender Reddy)కి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులకు మండల కేంద్రంలో 250 గజాల నివాసస్థలం, 25,000 రూపాయల గౌరవ వేతనం, స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించడం, అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం, అర్హులైన ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగం తదితర హామీల అమలుకోసమై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కాట్రపల్లి గ్రామంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు