షాహీనా కుటుంబానికి ఆర్థిక భరోసా

17-11-2026 | 04:57pm

ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డి

సిద్దిపేట రూరల్, నవంబర్ 17: సిద్దిపేట రూరల్(Siddipet Rural) మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షాహీనా మృతి చెందడంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సహకారంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ సర్పంచ్, సిద్దిపేట రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబానికి గ్రామ ప్రజల తరఫున అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కుల పెద్దలు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు