జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ గా సంజయ్ పటేల్
వెంకటాపూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): జవహర్ బాల్ మంచ్(Jawahar Bal Manch) ములుగు జిల్లా చైర్మన్ గా మండలంలోని నల్లగుంట గ్రామానికి(Nallagunta village) చెందిన కామ సంజయ్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం జవహర్ బాల్ మంచ్ జాతీయ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ చైర్మన్ డాక్టర్ జి.వి. హరి, తెలంగాణ జాతీయ సమన్వయకర్త ఇంచార్జి డాక్టర్ శామ్యూల్ జార్జ్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రుషికేశ్ రెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ బొక్క ప్రమోద్ నియామక ఉత్తర్వులు జారీ చేసి సంజయ్ పటేల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ పటేల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా చైర్మన్ బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బాలల హక్కులు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.