విబి జి-ఆర్ఏఎంజి పనులు పరిశీలిన చేసిన ప్రత్యేక అధికారి
నాగిరెడ్డిపేట్, నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని రాఘవపల్లి గ్రామంలో విబి జి-ఆర్ఏఎంజి పనులను మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్(Special Officer Raj Kumar) సందర్శించి పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. గ్రామంలో మంజూరైన నూతన పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ... రాఘవపల్లి గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విబిజి-ఆర్ఏఎం జి పనులు చేపట్టి గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని తెలిపారు.
గ్రామంలో జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్కరు పనులకు హాజరై ఉపాధి పొందాలన్నారు. అలాగే లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేపట్టాలని, ఇంకుడు గుంతలు కూడా చేపట్టాలని తెలిపారు. రాఘవపల్లి గ్రామంలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరు అయ్యాయి, ఎన్ని పూర్తి అయ్యాయి, ఇంకా పనులు ఎన్ని కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్, ఎంపీడీవో గంగాధర్, గ్రామ సర్పంచ్ నార్ల గంగమని మల్లేశం,పంచాయతీ కార్యదర్శి జానకి,వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.