ముగిసిన మార్కెట్ కమిటీ పదవికాలం

17-11-2026 | 04:53pm

సహకరించిన రైతులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపిన/చైర్మన్ చెలుకల తిరుపతి

రుద్రంగి నవంబర్ 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మార్కెట్ కమిటీ(Rudrangi Market Committee) సభ్యుల పదవికాలం ముగియడంతో మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ చెలుకల తిరుపతి ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా చైర్మన్ చెలుకల తిరుపతిని సర్పంచ్ గండి నారాయణ ఘనంగా సన్మానించారు.

వారు మాట్లాడుతూ, తమ పాలకవర్గానికి రెండు సంవత్సరాలుగా అన్ని విధాలుగా సహకరించిన రైతులకు అధికారులకు ప్రజలకు తోటి ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.రైతులకు సేవా చేసే భాగ్యన్ని కలిపించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రెండు సంవత్సరాల కాలంలో రైతుల ధాన్యన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామని అన్నారు.

రెండు సంవత్సరాల్లో పాలకవర్గం చేసినా అభివృద్ధి గురించి వివరించారు. మార్కెట్ కమిటీ కి 60 లక్షల నిధులు కేటాయించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం,మరియు పాలకవర్గ సభ్యులు,మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు