బీజేవైఎం మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్

17-11-2026 | 05:03pm

తలమడుగు, నవంబర్ 17 (విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (Bharatiya Janata Yuva Morcha) తలమడుగు మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్ నియమితులయ్యారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల సాయికృష్ణతో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు