పేదల ఇంట వెలగనున్న ఇందిరమ్మ దీపం
బోథ్, నవంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ భరోసా ఇచ్చారు. బోథ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు (Welfare Schemes) చేరేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటా ఇందిరమ్మ వెలుగులు నింపి, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మెరుగు భోజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ జి. రాజు యాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.