రాష్ట్రస్థాయి సోలో డాన్స్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
ఇల్లందు టౌన్, నవంబర్ 9 (విజయక్రాంతి): భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ యూనియన్(Bhadradri 24 Crafts Union) ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సోలో డాన్స్ పోటీల(Telangana and Andhra Pradesh State-Level Solo Dance Competition) బ్రోచర్‌ను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao), ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రస్థాయిలో నృత్య పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నృత్య కళాకారులకు వేదిక కల్పించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కార్తీక్, రామారావు తదితరులు పాల్గొన్నారు. కళాకారుల అభివృద్ధికి యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని ప్రతినిధులు తెలిపారు.