ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

09-11-2026 | 06:18pm
  • మాజీ ఎంపీ సోయం బాపూరావు....

సిరికొండ, నవంబర్09 ( విజయక్రాంతి ): సిరికొండ మండలంలోని(Sirikonda Mandal) వాయిపేట గ్రామంలో నిర్వహించిన ఆదివాసీల సంప్రదాయ పండుగ(Traditional festival of the Adivasis) దండారి, గుస్సాడి ఉత్సవాల్లో మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు(Soyam Bapurao)  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కళారూపాలను వీక్షించి ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల దండారి, గుస్సాడి ఉత్సవాలు  దేశంతో పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, కళలు, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ పండుగలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందన్నారు.

అలాగే గ్రామంలో రోడ్డు విద్యుత్ సమస్య ఉందని ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అందిస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామంలో నేల కొన్న సమస్య కేసు విషయం లో ఎవరు అధైర్య పడొద్దని తాను ఆదివాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలినో ప్రభావం ఆదిలాబాద్ జిల్లా కు తీవ్రంగా ఉంటుందని ప్రతి ఒక్కరు నీటిని విద్యుత్ ను వృధా చెయ్యకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో పెందూర్ శంభూ మహారాజ్, కినక శంభూ మహారాజ్, మండల కన్వీనర్ కంచం లక్ష్మణ్, డిసిసీ ఉపాధ్యక్షులు మాధవ్ రావు పటేల్, మండల సర్పంచ్ la సంగం అధ్యక్షులు బొడ్డు దత్తు, సుంకిడి సర్పంచ్ రాథోడ్ గణపత్,సొంపెల్లి సర్పంచ్ లక్ష్మీకాంత్, వాయిపేట ఉప సర్పంచ్ అవినాష్, లక్ష్మీపుర్ సర్పంచ్ కుంరం దీపక్, ఉప సర్పంచ్ లు తోకల రాజు, భీంరావ్,రాజ్ గోండ్ మండల అధ్యక్షులు యాదవ్ రావు, మాజీ అధ్యక్షులు ఇమామ్, డైరెక్టర్ లు పూర్కా జగన్, దుర్వ ఆనంద్, పోయాం భారీకరావు, కిషన్ పటేల్, వసంత్ రావు, మెస్రం నగేష్, జల్లు, గంగారాం, జల్పత్,దేవరీ, పటేల్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు