ఘనంగా దీపావళి పండుగ వేడుకలు

09-11-2026 | 05:52pm

తాడ్వాయి,నవంబర్,09( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో ఆదివారం దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేకువ జామున నిద్ర నుంచి లేచి తలంటు స్నానాలు చేసి భగవంతుడికి ప్రత్యేక పూజలు(Special prayers) చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో(devotional) హారతులు తీసుకున్నారు.తీపి పదార్థాలు స్వీకరించి టపాకాయలు పేల్చారు. సాయంత్రం వేళలో లక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో(devotional) పూజలు నిర్వహించారు.

అనంతరం టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో, కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో,ఎర్రపహాడు ఎల్లమ్మ దేవాలయంలో, దేమికలాన్ పార్వతి దేవాలయంలో సతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో, నందివాడ బసవన్న దేవాలయంలో పండుగ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు