క్రైస్తవులపై దాడులకు నిరసనగా కోదాడలో ర్యాలీ
పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐకి, అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రాల సమర్పణ
కోదాడ నవంబర్ 09(విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా క్రైస్తవులపై(Christians) రోజురోజుకూ పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ(Protection of Christians' Rights), మత స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కోదాడ పట్టణంలో(Kodad town) సోమవారం భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో క్రైస్తవ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘ పెద్దలు, మహిళలు, యువకులు , క్రైస్తవ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు తొలుత కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పట్టణ సీఐ కి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి ఏసయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పంది తిరుపతయ్య, సీపీఎం పార్టీ నాయకులు ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు వి. యేసయ్య, క్రైస్తవ నాయకులు రూజ్‌వెల్ట్, జి.ఆర్. అబ్రహం, కర్ల ప్రభుదాస్, డేవిడ్ రాజారావు, శాంత వర్ధన్, రాజేష్, సామేలు, కిరణ్, పాల్ చారి, జాన్, కోటయ్య, జాన్ చలమయ్య, డాకూరి ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.