చేగుంటలో ఘనంగా ఆర్టీఐ సాధన కమిటీ వార్షికోత్సవం

09-11-2026 | 05:55pm

చేగుంట నవంబర్ 9: సమాచార హక్కు చట్టం(Right to Information Act) సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని చేగుంట మండలం లోని ఎంపీడీఓ కార్యాలయంలో(MPDO Office) సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము సురేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము సురేందర్, మహిళా వింగ్ అధ్యక్షులు కొమ్ము మమత, జనరల్ సెక్రటరీ లింగం వర్కింగ్ ప్రసిడెంట్ బుర్ర బిక్షపతి గౌడ్ జిల్లా సెక్రటరీ చిక్కుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు