ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

09-11-2026 | 06:15pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను(Complaints) సత్వరమే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, బి. దేవసహాయం ప్రజల నుంచి 23 దరఖాస్తులు స్వీకరించారు. పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, జాప్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు