దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
నిర్మల్ నవంబర్ 9 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ పోలీస్ స్టేషన్(Sarangapur Police Station) పరిధిలో ఈ నెల6 న రాత్రి రెండు వేర్వేరు దొంగతనాలు కేసులు(Theft cases) ఇద్దరిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాస్(DSP Srinivas) తెలిపారు. స్థానిక డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సారంగాపూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో కందూరి రాజమణి ఇంటికి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న ఇత్తడి, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
అదే రోజు రాత్రి జాం గ్రామంలో మనుకల రాజేశ్వర్ కి చెందిన Passion Pro బైక్ను కూడా దొంగిలించారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ నేతృత్వంలో సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు A1 సుగేందర్ (వైఎస్ఆర్ కాలనీ, నిర్మల్), A2 గబ్బర్ సింగ్ రాథోడ్ (ఆదిలాబాద్)లను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
నిందితుల వద్ద వస్తువులను బైకు, నగదు స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ జమీర్, కానిస్టేబుళ్లు మాధవ్, రవిలను