ఆదివాసీల కలలను ప్రభుత్వం ప్రోత్సహించాలి
న్యాయవాది పంద్రం శంకర్
బోథ్. నవంబర్ 9 (విజయక్రాంతి): తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను(Tribal culture and traditions) మర్చిపోకుండా ఆదివాసీలు గుసాడి ఉత్సవాలను(Tribals celebrate Gusadi festivals) జరుపుకుంటున్నారని న్యాయవాది పంద్రం శంకర్(Advocate Pandram Shankar) పేర్కొన్నారు మండలంలోని పిప్పల్ దరి. గ్రామంలో ఆదివాసి బృందాలకు ఆర్థిక చేయూతనిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుస్సాడీ పండుగ ఆదివాసీల ఐక్యతకు(The Gussadi Festival A Symbol of Tribal Unity) నిదర్శనం అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోకుండా ఆదివాసీలు వందల సంవత్సరాల నుండి ఉత్సవాలను జరుపుకుంటున్నారన్నారు.
ఆదివాసీలు గుసాడి సందర్భంగా ప్రదర్శించే నృత్యాలు భావితరాలకు నేర్పించాలన్నారు. ప్రభుత్వం ఆదివాసీల కళలను ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రభుత్వం గుస్సాడీలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రకృతిని పూజించే పండుగ అని గ్రామాల మధ్య బంధాలను సోదర భావాన్ని పెంపొందించేందుకు గొప్ప వేదిక గుస్సాడీ అని అన్నారు.