వివిధ పాఠశాలల్లో సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్ వర్క్ షాప్

20-11-2026 | 12:02am

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) కౌట బి, దన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్ లలో గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్స్ ఎక్సలెన్స్(Soham Academy of Humans Excellence)కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడమీ ఆర్ ఐ ఏ ఆధ్వర్యంలో హెచ్డిఎఫ్సి సహకారంతో ఒకరోజు రోబోటిక్స్ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మొదటిసారి రోబో టిక్స్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాక్టికల్స్ రోబోటిక్స్ విద్యను పరిచయం చేశారు.

శిక్షణ కార్యక్రమంలో మొత్తం 354 మంది విద్యార్థులు పాల్గొనగా 220 మంది  బాలికలు 134 మంది బాలురు పాల్గొన్నారు. వీరికి ప్రాథమిక అంశాలు అయిన ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటార్లు ,సర్క్యూట్ బిల్డింగ్ ,రోబోటిక్స్ పార్ట్స్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు రూపొందించడం జరిగింది. వర్క్ షాప్ ల విద్యార్థులకు సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలు, జట్టు భావన ,సాంకేతిక ఆలోచన, విధానాన్ని అభివృద్ధి చేయడం లో కీలక పాత్ర పోషించింది. వర్క్ షాప్ ముగింపు సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. అంతేగాక నిరంతరం రోబోటిక్స్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు పాఠశాల యాజమాన్యానికి రోబోటిక్స్ క్లబ్ సభ్యులకు అందించారు.

మరిన్ని వార్తలు