బైక్ అదుపుతప్పి లోయలో పడ్డ ద్విచక్ర వాహనం

20-11-2026 | 12:00am

కారడవిలో రాత్రంతా నరకయాతన

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district) కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టల గంగారం అడవిలో చిట్యాల గ్రామానికి చెందిన ఆలం బాబు (45) ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయాడు. నిన్న వ్యక్తిగత పనులు నిమిత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి ద్విచక్ర వాహనంతో పడిపోయాడు. కాటారం వెళ్లిన వ్యక్తి రాత్రికి ఇంటికి రాకపోవడం,తెల్లవారి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడిన కుటుంబ సభ్యులు దేవాదుల -ముకునూర్ రహదారి గుండా గాలించడంతో ముళ్ల పొదలో ఉన్న వ్యక్తి గమనించడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కొరకు ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకి పంపించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పిన  ఘటనలో తలకు  బలమైన గాయం,కుడి చేతి మణికట్టు వద్ద విరిగినట్టు సమాచారం.ఈ కార్యక్రమంలో 108ఈఎంటీ వెంకటేష్, పైలట్ సతీష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు