ఐఎంఏ వరంగల్ నూతన కార్యవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం
నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ పి. ప్రవీణ్, డాక్టర్ వి.నరేష్ కుమార్
హనుమకొండ,(విజయక్రాంతి): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ(Indian Medical Association Warangal branch) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. వి. విజయ్ కుమార్,మాజీ అధ్యక్షులు డా. పి. కిషన్, రాష్ట్ర అధ్యక్షులు డా. సంజీవ్ సింగ్ యాదవ్,డా. సి.హెచ్. జగన్ మోహన్ రావు, డా. ఇ. రవీందర్ రెడ్డి, డా. పి. కాళీప్రసాద రావు,డా. పి. విజయ్ చందర్ రెడ్డి, టి.వి. శ్రీనివాస్,డా. జె. విజయ రావు, డా.కస్తూరి ప్రమీల,డా. పి. సుధీర్ కుమార్,డా. బి. బాలాజీ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఐఎంఏ నూతన అధ్యక్షులుగా డా. పి. ప్రవీణ్,డా. టి. సనత్ కుమార్, ఉపాధ్యక్షులుగా డా. మానస నరహరి, డా. జి. రాజేశ్వర్ రెడ్డి,డా. బి. నరేష్, డా. తెలుగు రామకృష్ణ ప్రధాన కార్యదర్శిగా డా. వేములపల్లి నరేష్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా డా. జె. కావ్య రావు,డా. బండి సంతోష్ కుమార్, డా. శివ సృజన్, డా. బి. పూర్ణ చంద్ర, కోశాధికారిగా డా. ముప్పిడి దిలీప్ కుమార్ లు ఎన్నికైనారు. ఎంపికైన నూతన కార్యవర్గం ను టీం సంకల్ప్ గా ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్షులు డా. పి. ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో తమ" టీం పేరు సంకల్ప్" గా, అలాగే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణ ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం,నకిలీ వైద్యానికి అడ్డుకట్ట వేయడం, క్వాకరీ నిర్మూలనకు కృషి చేస్తూ, అనధికార వైద్య విధానాలపై చట్టబద్ధమైన చర్యలకు సహకరించడం, అర్హత కలిగిన వైద్యుల గౌరవాన్ని కావడం కోసం కృషి చేస్తామన్నారు. ఐఎంఏ సభ్యులు,వారి కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించి,సీనియర్ వైద్యులు,యువ వైద్యుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మహిళా వైద్యుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఐఎంఏ సభ్యత్వాన్ని బలోపేతం చేస్తామన్నారు.
గత కార్యవర్గం ప్రారంభించిన స్వంత్యా లైఫ్ స్పేస్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లి, ఐఎంఏ భూమిని వైద్యుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఉపయోగపడే సమగ్ర వెల్నెస్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి డా. వేములపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ సభ్యుల సమస్యల పరిష్కారం, వైద్యుల హక్కులు, వైద్య వృత్తి గౌరవ పరిరక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణకు కార్యవర్గ సభ్యులందరి తో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రతి సభ్యుడి సూచనకు ప్రాధాన్యతనిస్తూ ఐఎంఏను మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ఐఎంఏ నాయకులు, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు,వైద్య ప్రముఖులు, ఐఎంఏ సభ్యులు,వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.