సోలార్ విద్యుత్ పలకలపై శిక్షణ
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో గల NPDCL SE కార్యాలయంలో విద్యుత్ ఇంజనీర్లకు సోలార్ విద్యుత్ పై రెండు రోజుల శిక్షణ తరగతులు గురు వారంతో ముగిశాయి. REC (Rural Electrification Corporation of India Ltd) ఆధ్వర్యంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని 40 మంది విద్యుత్ ఇంజనీర్లకు గృహ విద్యుత్ సోలార్ పలకలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. మంచిర్యాల SE బి రాజన్న పలు సూచనలు చేశారు.
ఫ్యాకల్టీలు నాగేశ్వరరావు, వంశీకృష్ణ గారు వివిధ అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం రెండు రోజుల శిక్షణకు హాజరైన వారందరికీ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ కైసర్, మంచిర్యాల ఏడిఈ లు వేణుగోపాల్, రాజశేఖర్, తిరుపతి, బాలకృష్ణ, రవికుమార్, శ్రీనివాస్, ఏడిఈ (కమర్షియల్) మోహన్ రెడ్డి, డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) దుర్గం మల్లేశం, ఆసిఫాబాద్ ఏడిఈ రాజేశ్వర్ తో పాటు రెండు జిల్లాల ఏఈలు, సబ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.