దేవాపూర్ పీఎస్ డీసీపీ ఆకస్మికంగా తనిఖీ

19-11-2026 | 11:37pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలిస్టేషన్(Devapur Police Station) ను మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్(DCP Bhaskar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ గంగారాంను కేసుల ఆన్‌లైన్ నమోదు,ఐటీటీ ఎస్‌ఓ కేసులు,ఈ-సాక్ష్య, ఈ-సమన్ల అమలు, దర్యాప్తులో ఉన్న (UI) కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీట్ కలిగిన వ్యక్తులు,ఇతర నేర చరిత్ర ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ,వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్టేషన్‌లో విధులు నిర్వహించే ప్రతి అధికారి,సిబ్బంది సీసీటీఎన్ఎస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు, వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని డీసీపీ ఎ.భాస్కర్ సూచించారు.

మరిన్ని వార్తలు