వేయి స్తంభాల ఆలయ ఆవరణ విస్తరణకు సహకరించాలి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ,(విజయ క్రాంతి): భూసేకరణ ప్రక్రియకు ఇళ్ల యజమానులు సహకరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి(Collector Chahat Bajpai) అన్నారు. చారిత్రక వేయి స్తంభాల ఆలయ(Thousand Pillar Temple) అభివృద్ధి,ఆవరణ విస్తరణకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ పైన సంబంధిత అధికారులతో, ఇళ్ల యజమానులతో కలెక్టర్ గురువారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... పురావస్తు ప్రాధాన్యత కలిగిన వేయి స్తంభాల ఆలయ పరిసరాల విస్తరణ, అభివృద్ధికి భూసేకరణ చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఇందుకు ఇళ్ల యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కోరారు. ఆలయ ఆవరణ విస్తరణ ద్వారా చారిత్రక కట్టడం అభివృద్ధి ఎంతో ముఖ్యమైనదని, ఇందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, కుడా డిప్యూటీ కలెక్టర్, కుడా పీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.